Wednesday 31 December 2014

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి దేవతలు శ్రీవైకుంఠంలో చేరి శ్రీమన్నారాయణుని సేవించుకునే పర్వదినమే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశినాడు భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఉపవాసముండి భగవన్నామ సంకీర్తనం, జాగారంతో గడుపుతారో వారికి తప్పక మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ ఏకాదశిని ‘మోక్షదా’గా వేదవ్యాస మహర్షి కీర్తించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శేషశయ్యపై జగద్రక్షణ చింతనాపరమైన యోగనిద్రలోనున్న శ్రీమహావిష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొని బ్రహ్మాది దేవతలకు దర్శనభాగ్యం ప్రసాదించే పర్వదినం యిదని సృష్టాదిలో విశ్వసృష్టికి సంకల్పం చేసిన రోజని శాస్త్రాలు చెప్పతున్నాయి.
భగవద్దర్శనం కోసం పరితపించే దేవతలందరూ రుూ నాలుగు నెలలు దీక్షతో చాతుర్మాస్య వ్రతంగా ఆచరిస్తారని, ‘యతి ధర్మ సముచ్ఛయం’ అనే ధర్మ శాస్త్రం చెబుతుంది. సకల జీవరాశులలో విష్ణురూపంగా, అంతర్యామిగా వున్న పరమాత్మకు విశ్రాంతి (యోగ) కాలమైన రుూ నాలుగు మాసాలలో అందరూ దైవచింతనలో వుండాలని ‘ఆర్షవాణి’ బోధిస్తుంది. అందుకే యతీశ్వరులు, సన్యాసులు తమ నిత్య సంచారం మానివేసి ఏదో ఒక పవిత్రమైన చోట జప తపాదులతో రుూ వ్రతాన్ని ఆచరిస్తారు.
చాతుర్మాస్య వ్రతానికి ఫలంగా వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశియే రుూ ముక్కోటి ఏకాదశి. సంక్రమణాన్ని అనుసరించి ఒక్కొక్కసారి పుష్య శుద్ధ ఏకాదశినాడు కూడా రుూ ఉత్సవాన్ని ఆచరిస్తారు. పరమ పవిత్రమైన రుూ రోజున ఉత్తరద్వారంలో గరుడవాహనంపై వేంచేసి యున్న శ్రీ మహావిష్ణువును ఎవరైతే సేవిస్తారో వారికి భగవదనుగ్రహం, మోక్షం తప్పక కలుగుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనంవల్ల జన్మరాహిత్యం, మోక్షం తప్పక కలుగుతాయని ‘పరమ పురుష సంహిత’ అనే ఆగమశాస్త్రం తెలుపుతుంది. ‘అల వైకుంఠపురంలో - నగరిలో ఆ మూల సౌధమ్ములో’ అని మహాభాగవతంలో పోతన అన్నట్లు ధృవ మండలానికి ఈశాన్యముగా, బ్రహ్మాండానికి ఆవల త్రిపాద్విభూతిగా వేదం కీర్తించిన శ్రీవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార ముఖంగానే పరివేష్ఠించి ఉంటారని ‘అర్చిరాది’ గ్రంథంలో ఉంది. స్వస్తిక గృహంవలె నాలుగు ద్వారాలతో విరాజిల్లే శ్రీవైకుంఠ భవానానికి ఉత్తర ద్వార పాలకులుగా జయ- విజయులుంటారని ఆగమ శాస్త్రంలో వుంది. అందువల్లనే ఉత్తర ద్వారం నుంచే శ్రీమన్నారాయణుని సేవించాలని నిర్ణయించడం జరిగింది. ఉత్+తర = ఉత్తర అనగా బ్రహ్మాండమును తరింపజేసి విష్ణుపదములను పొందించునది అని అర్థము. సాధకుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుస్థానంబు సలిపి కల్పోక్త ప్రకారంగా నానావిధ వేద మంత్రముల చేతగాని పురుష సూక్తము చేతగాని శ్రద్ధా భక్తియుక్తుండై పూజ చేయవలెను. ఎలాగంటే ప్రథమ మందు పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోకములచే అభిషేకమొనర్చి మహావిష్ణువును సర్వవస్తమ్రులచే నలంకరించి నానా విధములగు పుష్పముల చేతను ధూప దీపాదులచే పూజించి భక్తి పురస్సరముగా నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనములు సమర్పించవలయును. లోకమునందు యవ్వరేనియు రుూ ప్రకారము పూజ గావించుచుందురో వారలు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్సమృద్ధి గలిగి మిగుల జయశాలులై యుందురు. పూజ చేసిన తరువాత సంతుష్టుడుగానున్నూ, స్వచ్ఛమైన మనస్సుగల వాడున్నూ కాగలడు.
పూజాకాలమునందు ధూపదీపములు చేసినవాడు గంగా స్నానఫలము పొందును. పాపము గలవాడెవ్వడైనను నీరాజనమును చూచినటులయితే వాని పాపమంతయు నిప్పులోబడిన పత్తి పోగువలె మండిపోవును. ఎవడు నీరాజనమును నేత్రములయందు, శిరస్సునందును అద్దుకొనునో వారికి విష్ణులోకము కలుగును.
http://www.andhrabhoomi.net/node/197223

No comments:

Post a Comment