Wednesday, 31 December 2014

సర్వవేదాంత సారం భగవద్గీత

మనిషి నడవాల్సిన రీతిని, చెయ్యవలసిన కర్మలని, ధర్మమార్గంలో నడిపే పద్ధతుల్ని, ధైర్యాన్ని నూరిపోసేదే భగవద్గీత. ఇది కేవలం కృష్ణుడు అర్జునుడికి మాత్రమే చెప్పింది కాదు. శ్రీకృష్ణ్భగవానుడు మానవాళినుద్దేశించి అర్జునుణ్ణి మిషగా పెట్టి చేసిన ప్రబోధం.
భగవంతుడు అందులో స్పృశించని విషయం లేదు. వేదాల, ఉపనిషత్తుల సారమంతా అందులో వుందని అన్నీ తెలిసిన పెద్దలు చెప్పగా వింటున్నాం. ఇది అనన్య సామాన్యమైన గ్రంథమని, ఇందులో లేని విషయం లేదని, అందరూ ఆరాధించవలసిన ఆచరించవలసిన విషయాలెన్నో ఇందు పొందుపరచి ఉన్నారని పెద్దల మాట.
నేటి మానవుడు ఎంతో విజ్ఞానాన్ని సముపార్జించాడు. గగన వీధులలో విహరిస్తున్నాడు. గ్రహాలలోనూ కాలుమోపుతున్నాడు. సాగరపు లోతు, ఆకాశపు ఎత్తును కనుగొనడానికి ముందే ఉంటున్నాడు. ఇలా మొత్తం ప్రకృతిని కూడా జయంచాలని పోరాడుతునే ఉన్నాడు. మనుగడకోసం పోరాటం సల్పి విజయం సాధించిన వ్యక్తి మనసును గెలవలేకపోతున్నాడు. దాంతో గ్రహాలపై తిరిగినా, ఆకాశంలో పక్షికన్నా వేగంగా పరుగెత్తినా, నీటిలో చేపకన్నా త్వరగా ఈదగలిగినా కూడా మనిషి మనిషితనంతో బతకలేకపోతున్నాడు.
మనిషితనం అంటే మంచితనం, అనురాగం, అప్యాయత, ప్రేమ పంచలేని వ్యక్తి విచక్షణ ఉన్నా విచక్షణలేని మృగానికన్నా హీనంగా చరిస్తున్నాడు. ఇంద్రియాలపై జయకేతనం ఎగురవేయలేని వ్యక్తి దినదినాభివృద్ధి జరుగుతున్నట్లుగా కనిపించినా, అతనిలో రేకెత్తే వాంఛలు అథఃపాతాళానికి మనిషిని చేరుస్తునాయనిపిస్తుంది.
ఇవన్నీ పొడచూపకుండా ఉండాలంటే మనిషి మనసుపై విజయం సాధించాలి. దీనికి ధర్మాచరణ అనే ఆయుధాన్ని పట్టుకోవాలి. నిరంతరం అభ్యాసం చేయాలి. దీనికి భగవద్గీత పఠనం ఎంతో మేలు చేస్తుంది. భగవద్గీత పఠనం అంటే తెలుసుకోవడమే కాదు అందులో చెప్పిన నీతిని ఆచరించాలి. యజ్ఞం, దానం, ధర్మం అంటూ ఏదేదో తెలిసి కొంత, తెలియదని కొంత కర్మలను ఆచరించడం, నిరంతరమూ ప్రతి కర్మా ధర్మయుక్తమైనదా కాదా అన్న ఆలోచనతో కాలయాపన చేయకుండా నిష్కామ బుద్ధితో అంటే చేసేవాడు, చేయంచేవాడు భగవానుడే తాను అనునది నిమిత్తమాత్రమే.
నేను, నాది, నాచే అని గాక ఈశ్వరార్పణబుద్ధితో పని చేయండి - పని అంటే కర్తవ్యాన్ని చేయండి ఫలితాన్ని ఆశించకండి. ప్రతి విషయాన్ని నాపై ఆరోపించి మీరు మీ పని చేయండి. మీ యోగక్షేమాలు నేను చూస్తాను. మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో దాన్ని నేను ఇస్తాను. మీరు నిశ్చంతగా ఉండండి అని ఇసుమంత కష్టం లేకుండా భగవానుడు చెప్పిన రీతిలో నడుచుకుంటే చాలు మనందరమూ మానవులమే కాదు మాధవులం అయతీరుతాం. ఇక అపుడు మనసు, ఇంద్రియాలు జయ, అపజయ అన్న మాటలేవీ వినిపించవు. నేను అనేదే లేనప్పుడు ఇక జయాపజయాలుకాని వాదోపవాదాలు కానీ ఏవీ ఉండవు. తాము ఓ పరికరంగా కర్మ ఆచరిస్తే పాపపుణ్యాలు దరిచేరవు. లౌకికము, గాని అలౌకికం గాని ఏదీలేకుండా నిరంతరమూ ఆనందచిత్తంతో ఉంటారు. ఆనందమయుడైన పరమాత్మను నిత్యం స్మరిస్తూ ఉంటాం. శరీరం జీవించి ఉన్నా, లేకున్నా ఎల్లప్పటి ఉంటే ఆత్మ నిత్యసంతోషినే కదా.
ఏ ఉపనిషత్ అయనా, వేదం అయనా ఆ పర్మమాత్మ ఒక్కడే సత్యము. మిగిలినదంతా మిథ్య అనే కదా చెబుతున్నాయ. భగవద్గీతలో రాగద్వేషాలతో కొట్టుకొని పోయే అర్జునుణ్ణి ఓదారుస్తూ శ్రీకృష్ణరూపంలో ఉన్న పరమాత్మ ఎవరు పుడ్తున్నారు, ఎవరు చస్తున్నారు, నేను చంపేయాల్సి వస్తోందే అనుకోవడం పొరపాటు అసలు నీవు ఎవరు అంటూ చేసిన హితబోధ సర్వ గ్రంథసారమే కదా. వేదసారమైనా అదేకదా. అందుకే అర్థం చేసుకుంటే భగవద్గీతనే సర్వవేదాంత సారం.

http://www.andhrabhoomi.net/content/b-417

ముక్కోటి ఏకాదశి

ముక్కోటి దేవతలు శ్రీవైకుంఠంలో చేరి శ్రీమన్నారాయణుని సేవించుకునే పర్వదినమే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశినాడు భక్తిశ్రద్ధలతో ఎవరైతే ఉపవాసముండి భగవన్నామ సంకీర్తనం, జాగారంతో గడుపుతారో వారికి తప్పక మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం.
ఈ ఏకాదశిని ‘మోక్షదా’గా వేదవ్యాస మహర్షి కీర్తించారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు శేషశయ్యపై జగద్రక్షణ చింతనాపరమైన యోగనిద్రలోనున్న శ్రీమహావిష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొని బ్రహ్మాది దేవతలకు దర్శనభాగ్యం ప్రసాదించే పర్వదినం యిదని సృష్టాదిలో విశ్వసృష్టికి సంకల్పం చేసిన రోజని శాస్త్రాలు చెప్పతున్నాయి.
భగవద్దర్శనం కోసం పరితపించే దేవతలందరూ రుూ నాలుగు నెలలు దీక్షతో చాతుర్మాస్య వ్రతంగా ఆచరిస్తారని, ‘యతి ధర్మ సముచ్ఛయం’ అనే ధర్మ శాస్త్రం చెబుతుంది. సకల జీవరాశులలో విష్ణురూపంగా, అంతర్యామిగా వున్న పరమాత్మకు విశ్రాంతి (యోగ) కాలమైన రుూ నాలుగు మాసాలలో అందరూ దైవచింతనలో వుండాలని ‘ఆర్షవాణి’ బోధిస్తుంది. అందుకే యతీశ్వరులు, సన్యాసులు తమ నిత్య సంచారం మానివేసి ఏదో ఒక పవిత్రమైన చోట జప తపాదులతో రుూ వ్రతాన్ని ఆచరిస్తారు.
చాతుర్మాస్య వ్రతానికి ఫలంగా వచ్చే మార్గశిర శుద్ధ ఏకాదశియే రుూ ముక్కోటి ఏకాదశి. సంక్రమణాన్ని అనుసరించి ఒక్కొక్కసారి పుష్య శుద్ధ ఏకాదశినాడు కూడా రుూ ఉత్సవాన్ని ఆచరిస్తారు. పరమ పవిత్రమైన రుూ రోజున ఉత్తరద్వారంలో గరుడవాహనంపై వేంచేసి యున్న శ్రీ మహావిష్ణువును ఎవరైతే సేవిస్తారో వారికి భగవదనుగ్రహం, మోక్షం తప్పక కలుగుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనంవల్ల జన్మరాహిత్యం, మోక్షం తప్పక కలుగుతాయని ‘పరమ పురుష సంహిత’ అనే ఆగమశాస్త్రం తెలుపుతుంది. ‘అల వైకుంఠపురంలో - నగరిలో ఆ మూల సౌధమ్ములో’ అని మహాభాగవతంలో పోతన అన్నట్లు ధృవ మండలానికి ఈశాన్యముగా, బ్రహ్మాండానికి ఆవల త్రిపాద్విభూతిగా వేదం కీర్తించిన శ్రీవైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వార ముఖంగానే పరివేష్ఠించి ఉంటారని ‘అర్చిరాది’ గ్రంథంలో ఉంది. స్వస్తిక గృహంవలె నాలుగు ద్వారాలతో విరాజిల్లే శ్రీవైకుంఠ భవానానికి ఉత్తర ద్వార పాలకులుగా జయ- విజయులుంటారని ఆగమ శాస్త్రంలో వుంది. అందువల్లనే ఉత్తర ద్వారం నుంచే శ్రీమన్నారాయణుని సేవించాలని నిర్ణయించడం జరిగింది. ఉత్+తర = ఉత్తర అనగా బ్రహ్మాండమును తరింపజేసి విష్ణుపదములను పొందించునది అని అర్థము. సాధకుడగు పురుషుడు స్నాన సంధ్యావందనాది నిత్య కర్మానుస్థానంబు సలిపి కల్పోక్త ప్రకారంగా నానావిధ వేద మంత్రముల చేతగాని పురుష సూక్తము చేతగాని శ్రద్ధా భక్తియుక్తుండై పూజ చేయవలెను. ఎలాగంటే ప్రథమ మందు పంచామృత స్నానము గావించి ఆ పిమ్మట శుద్ధోకములచే అభిషేకమొనర్చి మహావిష్ణువును సర్వవస్తమ్రులచే నలంకరించి నానా విధములగు పుష్పముల చేతను ధూప దీపాదులచే పూజించి భక్తి పురస్సరముగా నైవేద్యమునిచ్చి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆ పిదప కర్పూర నీరాజనములు సమర్పించవలయును. లోకమునందు యవ్వరేనియు రుూ ప్రకారము పూజ గావించుచుందురో వారలు సకల పాపములచే విడువబడి సమస్త సంపత్సమృద్ధి గలిగి మిగుల జయశాలులై యుందురు. పూజ చేసిన తరువాత సంతుష్టుడుగానున్నూ, స్వచ్ఛమైన మనస్సుగల వాడున్నూ కాగలడు.
పూజాకాలమునందు ధూపదీపములు చేసినవాడు గంగా స్నానఫలము పొందును. పాపము గలవాడెవ్వడైనను నీరాజనమును చూచినటులయితే వాని పాపమంతయు నిప్పులోబడిన పత్తి పోగువలె మండిపోవును. ఎవడు నీరాజనమును నేత్రములయందు, శిరస్సునందును అద్దుకొనునో వారికి విష్ణులోకము కలుగును.
http://www.andhrabhoomi.net/node/197223

Sunday, 28 December 2014

ఏక శ్లోకి భాగవతం

 

 ఆదౌ దెవకిదెవి-గర్భ-జననం గొపీ-గ్రిహె వర్ధనం
మాయ-పూతన-జీవ-తాప-హరణం గొవర్ధనొధారణం
కంసచ్చెదన-కౌరవాది-హననం కుంతీసుత్పాలనం
శ్రీమద్ భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం

మతమార్పిడుల నిషేధంపై ఎందుకింత గగ్గోలు?

మతమార్పిడి చట్టంపై గగ్గోలు పెడుతున్న శక్తులే మాట మార్పిడులను చేస్తున్నాయి .. ప్రోత్సహిస్తున్నాయి .
వివరాలు ఇక్కడ :
http://rajasulochanam.blogspot.in/2014/12/blog-post_28.html

Saturday, 27 December 2014

శ్రీ సుబ్రహ్మణ్య షొడషనామస్తొత్రం

 
ప్రథమొ జ్ఞానషక్త్యాత్మా ద్వితీయొ స్కంద ఎవ చ
అగ్నిర్గర్భస్చత్రుతీయస్యాత్ బాహులెయస్చతుర్థకః
గాంగెయః పంచమొవిద్యాత్ షష్టః షరవణొత్భవః
సప్తమః కార్తికెయ స్యాత్ కుమారస్యాదథాష్టకః
నవమః షణ్ముఖస్చైవ దషమః కుక్కుతద్వజః
ఏకాదశః  షక్తిధరొ గుహొ ద్వాదష ఎవ చ
త్రయొదశొ   బ్రహ్మచారి షాన్మాతుర చతుర్దషః
క్రౌంచదారి పంచదషః షొడషః షిఖి-వాహనః
 
ఇతి శ్రీ  సుబ్రహ్మణ్య షొడషనామస్తొత్రం సంపూర్ణం

సూర్యాష్టకం

 
ఆదిదెవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమొస్తుతె ||

సప్తాష్వరథమారూడం ప్రచణ్డం కష్యపాత్మజం
ష్వెథపద్మధరం దెవం తం సూర్యం ప్రణమామ్యహం ||

లొహితం రథమారూడం సర్వలొకపితామహం
మహాపాపహరం దెవం తం సూర్యం ప్రణమామ్యహం ||

త్రైగుణ్యం చ మహాషూరం బ్రహ్మావిష్ణు మహెష్వరం
మహాపాపహరం దెవం తం సూర్యం ప్రణమామ్యహం ||


బ్రమ్హితం తెజహ్ పుంజం చ వాయుమాకాషమెవ చ
ప్రభుం చ సర్వలొకానాం తం సూర్యం ప్రణమామ్యహం ||


బంధూకపుష్పసంకాషం హారకుణ్డల భూషితం
ఎకచక్రధరం దెవం తం సూర్యం ప్రణమామ్యహం ||


 తం సూర్యం జగత్కర్తారం మహాతెజహ్ ప్రదీపనం
మహాపాపహరం దెవం తం సూర్యం ప్రణమామ్యహం ||

తం సూర్యం జగతాం నాథం గ్యానవిగ్యాన మొక్షదం
మహాపాపహరం దెవం తం సూర్యం ప్రణమామ్యహం ||

Tuesday, 23 December 2014

ఆది శంకరాచార్య వ్రాసిన అచ్యుతాష్టకం


అచ్యుతం కేశవం  రామనారాయణం క్రిష్ణదామోదరం వాసుదెవం హరిం
శ్రీధరం మాధవం గొపికా-వల్లభం జానకీనాయకం రామచంద్రం భజె


అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం ష్రీధరం రాధికారాధితం
ఇందిరామందిరం చెతసా సుందరం దెవకీనందనం నందజం సందధె


విష్ణవె జిష్ణవె షంకినె చక్రిణె రుక్మిణిరాగిణె జానకీజానయె
వల్లవీవల్లభాయార్చితాయాత్మనె కంసవిధ్వంసినె వమ్షినె తె నమః


క్రిష్ణ గొవింద హె రామ నారాయణ ష్రీపతె వాసుదెవాజిత ష్రీనిధె
అచ్యుతానంత హె మాధవాధొక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక


రాక్షసక్షొభితహ్ సీతయా షొభితొ దణ్డకారణ్యభూ-పుణ్యతాకారణః
లక్ష్మణొనాన్వితొ వానరైస్సెవితొ అగస్త్యసంపూజితొ రాఘవహ్ పాతు మాం

ధెనుకారిష్టకా'నిష్టక్రుద్-ద్వెషిహా కెషిహా కంసహ్రుద్-వమ్షికావాదకః
పూతనాకొపకహ్ సూరజాఖెలనొ బాలగొపాలకహ్ పాతు మాం సర్వదా

విద్యుదుద్యొతవత్-ప్రస్ఫురద్-వాససం ప్రావ్రుడంభొదవత్-ప్రొల్లసద్విగ్రహం
వన్యయా మాలయా షొభితొరహ్స్థలం లొహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజె

కుంచితైహ్ కుంతలై-భ్రార్జమానాననం రత్నమౌలిం లసత్కుణ్డలం గణ్డయొః
హారకెయూరకం కంకణప్రొజ్జ్వలం కింకిణీ మజులం ష్యామలం తం భజె

అచ్యుతస్యాష్టకం యహ్ పఠెదిష్టదం ప్రెమతహ్ ప్రత్యహం పూరుషహ్ సస్ప్రుహం
వ్రుత్తతహ్ సుందరం కర్తువిష్వంభరం తస్య వష్యొ హరిర్జాయతె సత్వరం

Monday, 22 December 2014

మంగళ చండికా స్తోత్రం

 
 రక్ష రక్ష జగన్మాతా దెవి మంగళచందికె
హారికె విపదాం రాషె హర్ష-మంగళ-కారికె

హర్ష మంగళ దక్షె చ హర్ష మంగళ దాయికె
షుభె మంగళ దక్షె చ షుభె మంగళ చందికె


మంగళ మంగళార్హె చ సర్వ మంగళ మంగళె
సతాం మంగళదె దెవి సర్వెషాం మంగళాలయె


పూజ్య మంగళవారె చ మంగళాభీష్ట దైవథెయ్
పూజ్యె మంగళ భూపస్య మనువమ్షస్య సంతతం


మంగళాధిష్ఠాత్రు దెవి మంగళానాం చ మంగళె
సంసార మంగళాధారె మొక్ష మంగళ దాయినీ


సారె చ మంగళాధారె పారె చ సర్వకర్మణాం
ప్రతి మంగళవారె చ పూజ్యె చ మంగళ సుఖప్రదె


స్తొత్రెణానెన షంభుస్చ స్తుత్వా మంగళచందికాం
మంగళవారె రాహు కలౌ పూజాం క్ర్త్వా గతహ్ షివహ్

దెవ్యాస్చ మంగళం స్తొత్రం యం ష్రునొతి సమాహితహ్
తన్మంగళం భవెత్-తస్య నభవెత్ తద్-మంగళం

వర్ధంతె తత్-పుత్ర-పౌత్రా మంగళం చ దినె దినె

Sunday, 21 December 2014

శివ ఉపాసన మంత్రం

శివ ఉపాసన మంత్రం 
 
మహా నారాయణ ఉపనిషత్తు నుండి 
   నిధనపతయె నమః| నిధనపతాంతికాయ నమః|ఊర్ధ్వాయ నమః| ఊర్ధ్వలింగాయ నమః| హిరణ్యాయ నమః| హిరణ్యలింగాయ నమః| సువర్ణాయ నమః| సువర్ణలింగాయ నమః| దివ్యాయ నమః| దివ్యలింగాయ నమః| భవాయ నమః| భవలింగాయ నమః| షర్వాయ నమః | షర్వలింగాయ నమః| షివాయ నమః| షివలింగాయ నమః| జ్వలాయ నమః| జ్వలలింగాయ నమః| ఆత్మాయ నమః| ఆత్మలింగాయ నమః|
పరమాయ నమః| పరమలింగాయ నమః|
ఎతత్సొమస్య సూర్యస్య సర్వ లింగస్ఠాపతి పాణిమంత్రం పవిత్రం||

శ్రీ శివ అష్టోత్తర శత నామావళి

 
ఓం శివాయ నమః
ఓం మహెష్వరాయ నమః
ఓం షంభవె నమః
ఓం పినాకినె నమః
ఓం షషిషెఖరాయ నమః
ఓం వామదెవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినె నమః
ఓం నీలలొహితాయ నమః
ఓం షంకరాయ నమః
ఓం షూలపాణినె నమః
ఓం ఖత్వాంగినె నమః
ఓం విష్ణువల్లభాయ నమః
ఓం షిపివిష్తాయ నమః
ఓం అంబికానాథాయ నమః
ఓం ష్రీకంఠాయ నమః
ఓం భక్త-వత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం షర్వాయ నమః
ఓం త్రిలొకెషాయ నమః
ఓం షితికణ్ఠాయ నమః
ఓం షివప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినె నమః
ఓం కామారయె నమః
ఓం అంధకాసుర-సూదనాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాతాక్షాయ నమః
ఓం కలి-కాలాయ నమః
ఓం క్రుపానిధయె నమః
ఓం భీమాయ నమః
ఓం పరషు-హస్తాయ నమః
ఓం మ్రుగపాణయె నమః
ఓం జతాధరాయ నమః
ఓం కైలాషవాసినె నమః
ఓం కవచినె నమః
ఓం కఠొరాయ నమః
ఓం త్రిపురాంతకాయ నమః
ఓం వ్రుషాంకాయ నమః
ఓం వ్రుషభారూడాయ నమః
ఓం భస్మొద్ధూలిత-విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయిమూర్తయె నమః
ఓం అనీష్వరాయ నమః
ఓం సర్వగ్యాయ నమః
ఓం పరమాత్మనె నమః
ఓం సొమసూర్యాగ్ని-లొచనాయ నమః
ఓం హవిషె నమః
ఓం యగ్యమయాయ నమః
ఓం సొమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాషివాయ నమః
ఓం విష్వెష్వరాయ నమః
ఓం వీర్భద్రాయ నమః
ఓం గణనాథాయ నమః
ఓం ప్రజాపతయె నమః
ఓం హిరణ్యరెతసె నమః
ఓం దుర్ధర్షాయ నమః
ఓం గిరీషాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజంగ-భూషణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనె నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం క్రిత్తివాససె నమః
ఓం పురారాతయె నమః
ఓం భగవతె నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మ్రుత్యుంజయాయ నమః
ఓం సూక్ష్మతనవె నమః
ఓం జగద్వ్యాపినె నమః
ఓం జగద్గురువె నమః
ఓం వ్యొమకెషాయ నమః
ఓం మహాసెనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయె నమః
ఓం స్థాణవె నమః
ఓం అహిర్బుంధ్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం అష్తమూర్తయె నమః
ఓం అనెకాత్మనె నమః
ఓం సాత్వికాయ నమః
ఓం షుద్ధ-విగ్రహాయ నమః
ఓం షాష్వతాయ నమః
ఓం ఖణ్దపరషవె నమః
ఓం అగ్యాయ నమః
ఓం రజసె నమః
ఓం పాషవిమొచనాయ నమః
ఓం మ్రుడాయ నమః
ఓం పషుపతయె నమః
ఓం దెవాయ నమః
ఓం మహాదెవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం భగనెత్రభిదె నమః
ఓం త్రిలొచనాయ నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం పూషదంతభిదె నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపదె నమః
ఓం అపవర్గ-ప్రదాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమెష్వరాయ నమః
ఇతి శ్రీ శివ అష్టోత్తర శత నామావళి సంపూర్ణం

ఆది శంకరాచార్యులు వారు వ్రాసిన ఆత్మ ( నిర్వాణ ) స్తోత్రముమనొ బుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ ష్రొత్ర జిహ్వె న చ ఘ్రాణ నెత్రె
న చ వ్యొమభూమిహ్ న తెజొ న వాయుః
చిదానందరూపహ్ షివోహం షివోహం (1)న చ ప్రాణసమ్జొ న వై పంచవాయుః
న వా సప్తధాతుర్ న వా పంచకొషః
న వాక్ పాణిపాదౌ న చొపస్థపాయు
చిదానందరూపహ్ షివోహం షివోహం (2)న మె ద్వెషరాగౌ న మె లొభమొహౌ
మదొ నైవ మె నైవ మాత్సర్యభావః
న ధర్మొ న చార్ఠొ న కామొ న మొక్షః
చిదానందరూపహ్ షివోహం షివోహం (3)న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుహ్ఖం
న మంత్రొ న తీర్ఠం న వెదొ న యగ్యాః
అహం భొజనం నైవ భొజ్యం న భొక్తా
చిదానందరూపహ్ షివోహం షివోహం (4)న మె మ్ర్త్యుషంకా న మె జాతిభెదః
పితా నైవ మె నైవ మాతా న జన్మః
న బంధుర్ న మిత్రం గురుర్నైవ షిష్యః
చిదానందరూపహ్ షివోహం షివోహం (5)


అహం నిర్వికల్పొ నిరాకారరూపొ
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వెంద్రియాణాం
సదా మె సమత్వం న ముక్తిర్ న మెయః
చిదానందరూపహ్ షివోహం షివోహం (6)

శివ రక్షా స్తోత్రం

 

చరితం దెవదెవస్య మహాదెవస్య పావనం
అపారం పరమొదారం చతుర్వర్గస్య సాధనం


గౌరీవినాయకొపెతం పంచవక్త్రం త్రినెత్రకం
షివం ధ్యాత్వా దషభుజం షివరక్షాం పఠెన్నరః


గంగాధరహ్ షిరహ్ పాతు భాలం అర్ధెందుషెఖరః
నయనె మదనధ్వంసీ కర్ణొ సర్పవిభూషణ


ఘ్రాణం పాతు పురారాతిహ్ ముఖం పాతు జగత్పతిః
జిహ్వాం వాగీష్వరహ్ పాతు కంధరాం షితికంధరః


ష్రీకణ్ఠహ్ పాతు మె కణ్ఠం స్కంధౌ విష్వధురంధరః
భుజౌ భూభారసమ్హర్తా కరౌ పాతు పినాకధ్ర్క్

హ్రుదయం షంకరహ్ పాతు జఠరం గిరిజాపతిహ్
నాభిం మ్రుత్యుంజయహ్ పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః


సక్థినీ పాతు దీనార్త-షరణాగతవత్సలః
ఉరూ మహెష్వరహ్ పాతు జానునీ జగదీష్వరః


జంఘె పాతు జగత్కర్తా గుల్పౌ పాతు గణాధిపహ్
చరణౌ కరుణా సింధుహ్ సర్వాంగాని సదాషివహ్


ఎతాం షివబలొపెతాం రక్షాం యహ్ సుక్రుతీ పఠెత్
స భుక్త్వా సకలాంకామాన్ షివ-సాయుజ్యమాప్నుయాత్
గ్రహభూత-పిషాచాద్యాస్త్రైలొక్యె విచరంతి యె
దూరాదాషు పలాయంతె షివనామాభి రక్షణాత్
 
అభయంకరనామెదం కవచం పార్వతీపతేః
భక్త్యా బిభర్తి యహ్ కణ్ఠె తస్య వష్యం జగత్రయం
ఇమాం నారాయణహ్ స్వప్నె షివరక్షాం యథాదిషత్
ప్రాతరుత్థాయ యొగీంద్రొ యాగ్యవల్క్యహ్ తథా'లిఖెత్ 

Saturday, 20 December 2014

శుక్లాంబరధరం విష్ణుం ... తాత్పర్యము
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్ భుజం 
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే 


శుక్ల = తెల్లని; అంబర = వస్త్రం (ఆకాశం అని ఇంకొక అర్థం); ధరం = ధరించిన వాడు;  విష్ణుం = సర్వాంతర్యామి; శశి* = చంద్రుడు.  వర్ణం = రంగు; చతుర్ = నాలుగు; భుజం = భుజాలు గల; ప్రసన్న = చిరునవ్వు తో కూడిన; వదనం = ముఖము; ధ్యాయేత్ = ధ్యానింతును; సర్వ = అన్ని, సమస్త; విఘ్న = అడ్డంకులు; ఉపశాన్తయే = తొలగించు. 


తాత్పర్యము:

తెల్లని వస్త్రమును ధరించి, చంద్రుని వలె తెల్లని రంగు తో వెలుగుతూ, సర్వాంతర్యామి యై, నాలుగు భుజములు కలిగిన వానిని (గణేషుని), అన్ని అడ్డంకులు తొలగించమని ప్రార్థించెదను. 

శ్రీ షిరిడి సాయిబాబా ఏకాదశ సూత్రములు


 


శ్రీ షిరిడి సాయిబాబా ఏకాదశ సూత్రములు
1) శిరిడీ ప్రవేశమే సర్వదు:ఖ పరిహారము
2) ఆర్తులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశమొనరించి నంతనే సుఖ సంపదలను పొందగలరు.
3) ఈ భౌతిక దే హానంతరము నేనప్రమత్తుడనే.
4) నా భక్తులకు రక్ష్ ణంబు నా సమాధి నుండియే వెలువడుచుండును.
5) నా సమాధి నుండే నా మనుష్య శరీరము మాట్లాడును.
6) నన్నాశ్రయించిన వారిని, శరను జొచ్చినవారిని రక్షించుటయే నా కర్తవ్యము.
7) నా యందెవరికి ద్రుష్టియొ వరియందే నా కటాక్షము.
8)మీ భారములు నాపై బడవేయుడు నేను మొసెద ను.
9) నా సహాయము కాని, సలహాను కాని కోరిన తక్షన మొసంగ సంసిద్దుడను.
10) నా భక్తుల యందు 'లేమి' యను మటే పొడసూపదు.
11) నా సమాధి నుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.

ఓం శ్రీ సాయిరాం..ఓం శ్రీసాయిరాం...ఓం శ్రీసాయిరాం