Tuesday, 8 December 2015

శాస్త్రాల ప్రకారం మనకు ఐదుగురు తల్లులు, ఐదుగురు తండ్రులు

గురుపత్నీ రాజపత్నీ జ్యేష్ఠభ్రాతుః కుటుంబినీ
పత్నీమాతా స్వమాతాచ పంచైతాః మాతరః స్మృతాః!!
దేశాన్ని పరిపాలించే రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్య తల్లి, కన్నతల్లి ఈ ఐదుగురూ తల్లులే. అందరినీ మాతృభావనతోనే గౌరవించాలి.
అలాగే తండ్రులు కూడా ఐదుగురని శాస్త్రం చెప్పింది.
జనితాచోపనేతాచ యేన విద్యోపదిశ్యతే
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః!! అని.
కన్నవాడు, ఉపనయనం చేసినవాడు, గురువు, అన్నం పెట్టినవాడు, ఆపదలు వచ్చినపుడు కాపాడి భయం పోగొట్టినవాడు... ఈ అయిదుగురూ తండ్రులే.
తండ్రుల పట్టికలో అన్నగారి పేరు చేర్చలేదు. కాని ‘భయత్రాత’ ముందుగా అన్నగారే అవుతాడు. తల్లిదండ్రుల తరువాత తనకు కొండంత అండగా అన్నగారే కనిపిస్తాడు. ఏ తమ్ముడైనా అన్నగారి వల్లనే ఆ ఆపద నుండి బయటపడతాడు. పైగా అన్నగారి భార్య తల్లివంటిదని చెప్పాక అన్నగారు తండ్రివంటివారని వేరుగా చెప్పనక్కరలేదు. ఆ ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి, అన్నగారిని తండ్రిగాను, వదినగారిని తల్లిగాను గౌరవించినవాడు లక్ష్మణుడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఆనాడే లోకానికి తెలియజేసింది రామాయణం.
దీ మన భారతీయత. ఇదీ మన ఆర్ష ధర్మం. ఇదీ మన సంస్కృతి. 

3 comments:

  1. అయిదుగురు పెళ్ళాలు కూడా ఉంటారు చూడరూ!
    మీకు పుణ్యముంటుంది - కాస్త చూసి చెబుదురూ:-)

    ReplyDelete
    Replies
    1. ఏక పెండ్లాము గృహచ్చిద్రం ద్విపెండ్లాం గృహ నాశనం !
      త్రిపెండ్లాం గ్రామ నాశంచ చాతుర్పెండ్లాం చ పట్టణం
      అథవా పంచ పెండ్లాంచ హరిహర పట్నం వినశ్యతి :)

      చీర్స్
      జిలేబి

      Delete