Tuesday, 8 December 2015

శాస్త్రాల ప్రకారం మనకు ఐదుగురు తల్లులు, ఐదుగురు తండ్రులు

గురుపత్నీ రాజపత్నీ జ్యేష్ఠభ్రాతుః కుటుంబినీ
పత్నీమాతా స్వమాతాచ పంచైతాః మాతరః స్మృతాః!!
దేశాన్ని పరిపాలించే రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్య తల్లి, కన్నతల్లి ఈ ఐదుగురూ తల్లులే. అందరినీ మాతృభావనతోనే గౌరవించాలి.
అలాగే తండ్రులు కూడా ఐదుగురని శాస్త్రం చెప్పింది.
జనితాచోపనేతాచ యేన విద్యోపదిశ్యతే
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః!! అని.
కన్నవాడు, ఉపనయనం చేసినవాడు, గురువు, అన్నం పెట్టినవాడు, ఆపదలు వచ్చినపుడు కాపాడి భయం పోగొట్టినవాడు... ఈ అయిదుగురూ తండ్రులే.
తండ్రుల పట్టికలో అన్నగారి పేరు చేర్చలేదు. కాని ‘భయత్రాత’ ముందుగా అన్నగారే అవుతాడు. తల్లిదండ్రుల తరువాత తనకు కొండంత అండగా అన్నగారే కనిపిస్తాడు. ఏ తమ్ముడైనా అన్నగారి వల్లనే ఆ ఆపద నుండి బయటపడతాడు. పైగా అన్నగారి భార్య తల్లివంటిదని చెప్పాక అన్నగారు తండ్రివంటివారని వేరుగా చెప్పనక్కరలేదు. ఆ ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి, అన్నగారిని తండ్రిగాను, వదినగారిని తల్లిగాను గౌరవించినవాడు లక్ష్మణుడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఆనాడే లోకానికి తెలియజేసింది రామాయణం.
దీ మన భారతీయత. ఇదీ మన ఆర్ష ధర్మం. ఇదీ మన సంస్కృతి. 

భార్య, భర్తకు ఏ వైపుగా ఉండాలి?

సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.   కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు
 కుడి వైపున ఉండాలి. 
బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి.   శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు. 
 

Sunday, 1 February 2015

హనుమాన్ చాలీసా

హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో  జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతుండేవాడు. వారి సన్నిధిలో చాలామందికి అనేక మహిమలు ద్యోతకమయేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారుతుండేవారు. సమకాలీనులైన ఇతర మతపెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మతమార్పిడులకు పాల్పడుతున్నాడని మొగల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ, అక్బర్ అంతగా పట్టించుకోలేదు.

ఇదిలా వుండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వక్రించి ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి 'దీర్ఘసుమంగళిభవః' అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు.

ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామ భక్తులుగా మరేవారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మతపెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయముగా వివరించి తగిన చర్యను తీసుకోవలసినదిగా ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీ పాదుషా తులసీదాస్ ను విచారణకు పిలిపించాడు. విచారణ ఇలా సాగింది.

పాదుషా :-  తులసీదాస్ జీ ! మీరు రామనామం అన్నిటి కన్న గొప్పదని ప్రచారం చేస్తున్నారట !

తులసీదాస్ :- అవును ప్రభూ ! ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభువు ! రామ నామ మహిమను వర్ణించటం ఎవరి తరము?

పాదుషా :- అలాగా ! రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు. నిజమేనా?

తులసీదాస్ :- అవును ప్రభూ ! రామనామానికి మించినదేమీ లేదు.

పాదుషా:- సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాము. దానిని మీ రామనామం ద్వారా బ్రతికించండి. అప్పుడు మీరు చెప్పినదంతా నిజమని నమ్ముతాము.

తులసీదాస్ :- క్షమించండి ప్రభూ ! ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభువు ఇచ్చానుసారం జరుగుతాయి. మానవమాత్రులు మార్చలేరు.

పాదుషా :- తులసీదాస్ జీ! మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరిముందు ఒప్పుకోండి.

తులసీదాస్ :- క్షమించండి ! నేను చెప్పేది నిజం !

పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, 'తులసీ ! నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాను. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో! లేదా శవాన్ని బ్రతికించు!' అని తీవ్రస్వరంతో ఆజ్ఞాపించాడు. అప్పుడు తులసీదాస్ కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడై శ్రీరామచంద్రుని స్మరించి ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని  ప్రార్థించాడు. అది రాజ ధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే ! ఎక్కడి నుంచి వచ్చాయో వేలాదికోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ ను బంధింప వచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని, వారిపై గురిపెట్టి కదలకుండా చేసాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి, ఎక్కడి వారు అక్కడ స్థాణువులై పోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్ కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. ఒడలు పులకించిన తులసీదాస్ ఆశువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు.

ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు 'తులసీ ! నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏమికావాలో కోరుకో!' అన్నాడు. అందుకు తులసీదాస్ 'తండ్రీ! నాకేమి కావాలి ! నేను చేసిన నీ స్తోత్రం లోక క్షేమం కొరకు ఉపయోగపడితే చాలు, నా జన్మచరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు  వేడుకున్నా, వారికి అభయం ప్రసాదించు తండ్రీ!' అని కోరుకున్నాడు.

ఆ మాటలతో మరింతప్రీతి చెందిన హనుమంతుడు 'తులసీ! ఈ స్తోత్రంతో మమ్ములను ఎవరు స్తుతించినా, వారి రక్షణ భారం మేమే వహిస్తాము' అని వాగ్దానం చేశారు. అప్పట్నుండి ఇప్పటివరకు 'హనుమాన్ చాలీసా' కామదేనువై భక్తులను కాపాడుతూనే ఉంది.

అపర వాల్మీకియైన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుక 'హనుమాన్ చాలీసా'. దాదాపు 500 ఏళ్ళ తరువాత కూడా ప్రతిఇంటా హనుమాన్ చాలీసా పారాయణ, గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి వెలుగుతూనే ఉన్నది.
- See more at: http://www.teluguone.com/devotional/content/hanuman-chalisa-mahathmyam-57-13418.html#sthash.fnjjmZog.dpuf

 ఇప్పుడు హనుమాన్ చాలీసా గానం చేద్దాం : 

దోహా

శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చౌపాయి:

జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 |
ప్రభు చరిత్ర సునివేకో రసియా
రామ లఖన సీతా మన బసియా |8 |
సూక్ష్మ రూప ధరి సియహిఁదిఖావా
వికట రూప ధరి లంక జరావా |9 |
భీమ రూప ధరి అసుర సంహారే
రామచంద్రకే కాజ సఁవారే |10 |
లాయ సజీవన లఖన జియాయే
శ్రీ రఘువీర హరషి ఉరలాయే |11 |
రఘుపతి కీన్హీ బహుత బడాయీ
తుమ్మమ ప్రియ భరతహి సమ భాయీ |12 |
సహస వదన తుమ్హరో యశగావైఁ
అస కహి శ్రీపతి కంఠ లగావై |13|
సనకాదిక బ్రహ్మది మునీశా
నారదా శారద సహిత అహీశా |14 |
యమ కుబేరా దిగపాల జహాఁతే
కవి కోవిద కహి సకే కహాఁతే |15 |
తుమ ఉపకార సుగ్రీవహిఁకీన్హా
రామ మిలాయ రాజపద దీన్హా |16 |
తుమ్హరో మంత్ర విభీషణ మానా
లంకేశ్వర భయే సబ జగ జానా | 17|
యుగ సహస్ర యోజన పర భానూ
లీల్యో త్యాహి మధుర ఫల జానూ |18 |
పభు ముద్రికా మేలి ముఖ మాహీఁ
జలిధిలాఁఘి గయే అచరజ నాహీ |19 |
దుర్గమ కాజ జగత కే జేతే
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే |20 |
రామ దుఆరే తుమ రఖవారే
హోత న ఆజ్ఞా బిను పైసారే |21 |
సబ సుఖులహై తుమ్హారీ శరనా
తుమ రక్షక కాహూకో డరనా |22 |
ఆపన తేజ సమ్హారో ఆపై
తీనోఁ లోక హాంకతే కాంపై |23|
భూత పిశాచ నికట నహిఁ ఆవై
మహావీర జబ నామ సునావై |24 |
నాసై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా |25 |
సంకట తేఁ హనుమాన ఛుడావై
మన క్రమ వచన ధ్యాన జో లావై |26 |
సబ పర రామ తపస్వీ రాజా
తినకే కాజ సకల తుమ సాజా |27 |
ఔర మనోరధ జో కోయి లావై
తాసు అమిత జీవన ఫల పావై |28 |
చారోఁ యుగ పరతాప తుమ్హారా
హై పరసిద్ధ జగత ఉజియారా |29 |
సాధు సంతకే తుమ రఖవారే
అసుర నికందన రామదులారే | 30|
అష్టసిద్ది నౌనిధి కే దాతా
అస వర దీనహి జానకీ మాతా |31|
రామ రసాయన తుమ్హారే పాసా
సదా రహో రఘుపతికే దాసా |32 |
తుమ్హారే భజన రామకోపావై
జన్మ జన్మకే దుఃఖ బిసరావై |33 |
అంతకాల రఘువరపుర జాయీ
జహాఁ జన్మ హరిభక్త కహాయీ |34 |
ఔర దేవతా చిత్తన ధరయీ
హనుమత సేయి సర్వ సుఖ కరయీ |35 |
సంకట హటై మిటై సబ పీరా
జోసుమిరై హనుమత బలవీరా |36 |
జైజైజై హనుమాన్ గోసాయీఁ
కృపాకరో గురుదేవకీ నాయీ |37 |
యహ శతవార పాఠకర్ కోయీ
ఛూటహిబంది మహా సుఖహోయీ |38 |
జో యహ పడై హనుమాన్ చాలీసా
హోయ సిద్ది సాఖీ గౌరీసా|39|
తులసీదాస సదా హరి చేరా|
కీజై నాథ హృదయ మహఁడేరా|40|

దోహ:

పవన తనయ సంకట హరన మంగళ
మూరతి రూప్ రామలఖన సీతా సహిత
హృదయ బసహు సురభూప్(తులసీదాసు)
శ్లో: రామాయ, రామచంద్రాయ రామభద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః
శ్రీ రాజా రామచంద్రకీ జై

హనుమాన్ చాలీసా సంపూర్ణము