Friday, 10 November 2023
Friday, 20 October 2023
ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ ప్రారంభం
తెలుగునాట మరో కొత్త ఆధ్యాత్మిక ఛానల్ ఆవిర్భవించింది. ఈటీవీ నెట్‌వర్క్‌లో ఇన్నాళ్లూ ఆరోగ్య సంజీవనిగా కొనసాగిన ఈటీవీ లైఫ్ ఛానల్ శుక్రవారం నుంచి ఆధ్యాత్మిక ఛానల్‌గా మార్పుచెందింది. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీ నెట్‌వర్క్ ఛానళ్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వచ్చిన విశేషాదరణ దృష్ట్యా ఈ మార్పు చేస్తున్నట్లు ఈటీవీ తెలిపింది. వీక్షకుల్లో జ్ఞానజ్యోతిని వెలిగించి, ఆధ్యాత్మికత వైపు నడిపించేలా చేయడమే ధ్యేయమని పేర్కొంది. దశాబ్దాలుగా తమ సంస్థకు గుండెల్లో కొండంత పీఠం వేసిన వీక్షక దేవుళ్లకు విజయదశమి కానుకగా ఈ ఛానల్‌ను ప్రారంభించామని, ఇందులో ఆధ్యాత్మిక సుసంపన్నతకు పెద్దపీట వేస్తామని తెలిపింది. ఉగాది మొదలు శివరాత్రి వరకు పండుగలు, పుణ్యతిథులు, బ్రహ్మోత్సవాలు, ప్రఖ్యాత ఆలయాలు, పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలతో జ్ఞానబోధ కోసం కృషి చేస్తామని ఈటీవీ పేర్కొంది.
Wednesday, 19 July 2023
శ్రీ శివ పంచాక్షర స్తోత్రం
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయ || ౧ ||
మందాకినీసలిలచందనచర్చితాయ
నందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ |
మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ
తస్మై మకారాయ నమః శివాయ || ౨ ||
శివాయ గౌరీవదనాబ్జబృంద-
-సూర్యాయ దక్షాధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమః శివాయ || ౩ ||
వసిష్ఠకుంభోద్భవగౌతమార్య-
-మునీంద్రదేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచనాయ
తస్మై వకారాయ నమః శివాయ || ౪ ||
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమః శివాయ || ౫ ||
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీశివ పంచాక్షర స్తోత్రం సంపూర్ణమ్ ||